రంగు మారింది : కాషాయం రంగులో దూరదర్శన్ లోగో..

రంగు మారింది : కాషాయం రంగులో దూరదర్శన్ లోగో..

దూరదర్శన్ న్యూస్..  ప్రభుత్వం ఛానెల్.. దూరదర్శన్ పుట్టినప్పటి నుంచి ఆ ఛానెల్ లోగో రంగు ఎర్ర రంగులో ఉండేది.. ఇప్పుడు లోగో రంగు మారింది.. ఏ రంగులోలో తెలుసా.. కాషాయం కలర్.. బీజేపీ అధికారంలో ఉండగా ఈ మార్పు జరగటం విశేషం.. 

2024 ఏప్రిల్ 16వ తేదీ రాత్రి నుంచి ఈ మార్పు జరిగింది. దూరదర్శన్, దూరదర్శన్ నేషనల్, డీడీ న్యూస్ అన్నీ ఛానెల్స్ లోగోలు మారిపోయాయి.. ఎరుపు, బులుగు రంగుల్లో ఉండే దూరదర్శన్ ఛానెల్స్ లోగో కలర్స్.. ఇప్పుడు కాషాయం రంగులోకి వచ్చేశాయి.. ఈ మార్పుపై విమర్శలు, ఆరోపణలు రావటంతో డీడీ న్యూస్ స్పందించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తల కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.. సరికొత్త డీడీ వార్తలను ఆస్వాదించండి.. మాకు దైర్యం ఉంది.. వేగం ఉంది.. నిజం ఉంది.. డీడీ న్యూస్ అంటేనే నిజం అంటూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. 

1959, సెప్టెంబర్ 15వ తేదీన దూరదర్శన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది. 1982 ఆగస్ట్ 15వ తేదీ నుంచి కలర్ లోకి మారింది. అదే ఏడాది ఆసియా గేమ్స్ లైవ్ ఇవ్వటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ప్రస్తుతం దూరదర్శన్ కింద ఆరు జాతీయ ఛానెల్స్, 17 ప్రాంతీయ ఛానెల్స్ నడుస్తున్నాయి. 

ఇప్పుడు లోగోల రంగును కాషాయంలోకి మార్చటం ద్వారా.. సరికొత్త ప్రయాణం మొదలైంది..