
మహారాష్ట్రలో ఓ వింత జరిగింది. మిగతా ప్రాంతాల్లోని జనాలకు వింతగా అనిపించొచ్చు కానీ.. అది వారి ఆచారం అంటున్నారు అక్కడి వారు. 24 మందికి బొమ్మలతో పెళ్లిచేశారు. ఇదేంటని అడిగితే… అదంతే అన్నారు. అలా చేయడం ఏంటని మరీ మరీ అడిగితే… అసలు విషయం చెప్పారు.
“ఏం చేయమంటారు.. కరువు కారణంగా మా ఊళ్లో పెళ్లీడుకొచ్చిన పిల్లలకు పెళ్లి కావడం లేదు. ఇప్పటికే 22 మంది యువకులు.. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయి. పిల్లను ఇవ్వడానికి.. పిల్లను చేసుకోవడానికి ఎవరూ రావడం లేదు. కరువు వచ్చింది కాబట్టే.. పెళ్లిళ్లు కూడా జరగడం లేదని అనుకుంటున్నాం. అందుకే పెళ్లీడుకొచ్చినా ఒంటరిగా ఉంటున్నవారికి బొమ్మలతో పెళ్లి చేశాం. మా పూర్వీకులు కూడా ఇలాగే చేసేవారు” అన్నారు ఆ గ్రామస్తులు.