బెంగళూరు ఎయిర్ పోర్టులో కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

బెంగళూరు ఎయిర్ పోర్టులో కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

బెంగళూరు ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.9.82 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్ దగ్గర ఈ నెల 14న జాంబియా, బెల్జియం నుంచి వచ్చిన రెండు అనుమానాస్పద పార్శిళ్లను అధికారులు గుర్తించారు. వీటిలో ఒక కిలో హెరాయిన్ సహా 4.5 కిలోల ఇతర డ్రగ్స్ పదార్ధాలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీటి విలువ మార్కెట్లో రూ.9.82 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. తాజాగా తమిళనాడు ఈరోడ్ సమీపంలో ఓ నైజీరియన్ అదుపులోకి తీసుకున్న అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తుండు