ఎండిన ‘కేటీఆర్ పార్క్’

ఎండిన ‘కేటీఆర్ పార్క్’

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంతో ఆర్భాటంగా మొక్కలు నాటి, అదే పార్కుకు ‘కేటీఆర్ పార్క్’ గా నామకరణం చేశారు. కానీ కొన్ని నెలలకే ఆ పార్క్ ఎండిపోయింది. వివరాల్లోకి వెళితే... వరంగల్ 65 డివిజన్ చింతగట్టు ఎస్సారెస్పీలో ఎకరం మేర టౌన్ పార్క్ ఏర్పాటు చేశారు. గతేడాది జులైలో మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్కులో మొక్కలు నాటారు. అదే రోజు దానికి కేటీఆర్ పార్క్ గా పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ పార్కును ఎవరూ పట్టించుకోకపోవడంతో మొక్కలన్నీ ఎండిపోయాయి.