పీడీఎస్​ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు

పీడీఎస్​ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు

మరికల్​, వెలుగు : రేషన్​ బియ్యం తరలించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో మీడియా  సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేద వారికి అందిస్తున్న రేషన్​ బియ్యంను సేకరించి కర్నాటకలోని మిల్లర్లకు దళారులు విక్రయిస్తున్నారని వారిపై పక్కా నిఘా పెట్టి పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారు ఎవరైన సరే చర్యలు తీసుకుంటామన్నారు. సివిల్​ సప్లయ్​ అధికారుల, పోలీసుల సమన్వయంతో మరికల్​, ధన్వాడ, నర్వ మండలాల పరిధిలో ఆరు రోజుల్లో 6 కేసులు చేసి 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యంను పట్టుకున్నామని చెప్పారు. రేషన్​ బియ్యాన్ని ఎవరైన కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే వారి సమాచారాన్ని మాకు వెంటనే ఒక్క మెసేజ్​ చేస్తే   వెంటనే స్పందిస్తామని ప్రజలను కోరారు. సీఐ రాజేందర్​, ఎస్సైలు హరిప్రసాద్​రెడ్డి, రమేష్​, కుర్మయ్యలు పాల్గొన్నారు.