
హైదరాబాద్, వెలుగు : ఫ్యాన్సీ నెంబర్ల 90వ ఫేస్ ఈ–ఆక్షన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 19 వరకు ఈ–ఆక్షన్ ఉంటుందని తెలిపింది. జీఎస్‌ఎం ప్రీమియం మొబైల్ నెంబర్ల ఈ–ఆక్షన్‌లో పాల్గొనేందుకు కస్టమర్లు http://eauction.bsnl.co.in పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ఉచితమని చెప్పింది.