ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్ .. పాలసీదారులకు బెనిఫిట్స్ ఏంటంటే..

ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్ .. పాలసీదారులకు బెనిఫిట్స్ ఏంటంటే..

మీరు బీమా పాలసీలు కలిగి ఉన్నారా..ఈ న్యూస్ తప్పనిసరిగా చదవాల్సిందే.. ఏప్రిల్ 1 నుంచి ప్రతి పాలసీని ఈ-పాలసీ పద్దతిలో జారీ చేయనున్నారు. ఈ-ఇన్సూరెన్స్ తప్పని సరి చేస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI)  బీమా సంస్థలను ఆదేశించింది. ఈ క్రమంలో ఈ-ఇన్సూరెన్స్ అంటే ఏమిటీ.. ఇన్సూరెన్స్ పాలసీలను డిజిట లైజేషన్ చేయడం  ద్వారా పాలసీదారులకు కలిగే లాభాలేంటీ వంటి పాలసీదారులకు ఉపయోగపడే సమాచారం తెలుసుకుందాం. 

ఈ-ఇన్సూరెన్స్ అంటే ఏమిటి 

ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్ లైన్ చేయడమే ఈ-ఇన్సూరెన్స్ లేదా ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ (EIA) లేదా ఈ-పాలసీ విధానం. IRDAI  ప్రకారం..జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణబీమా లతో సహా అన్ని వర్గాల బీమా పాలసీలను ఏప్రిల్ 1 నుంచి డిజిటలైజేషన్ చేసి ఈ-పాలసీలను జారీ చేస్తారు. ఈ -ఇన్సూరెన్స్ అకౌంట్ అనే ఆన్ లైన్ అకౌంట్ లో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. ఈ అకౌంట్ తో పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్లను ఆన్ లైన్ లోనే యాక్సెస్ చేయొచ్చు. వీటి నిర్వహణ కూడా సౌకర్యవంతంగా, సులభంగా ఉంటుంది. 

ఈ-ఇన్సూరెన్స్  లాభాలు 

ఈ-ఇన్సూరెన్స్ ద్వారా  కాగితపు పాలసీలకు స్వస్తి చెప్పనున్నారు. పేపర్ పాలసీలను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడం, అడ్రస్, సంప్రదింపు సమాచారం వంటి వివరాలను మార్చుకోవడంలో డిజిటలైజేషన్ ద్వారా ఈజీ అవుతుంది. పాలసీదారులకు బీమా కంపెనీలకు మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది.క్లెయిమ్ పరిష్కారం సులభతరం అవుతుంది. మొత్తం మీద పాలసీదారులకు మెరుగైన సేవలు, అధిక భద్రత అందుతుంది. అంతేకాదు ఒక్కోసారి డాక్యుమెంట్లు పోగొట్టున్నారు తిరిగి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్లతో పోలిస్తే ఈ-ఇన్సూరెన్స్ పత్రాలు కోల్పోయే అవకాశం తక్కువ. పాలసీ డిటైల్స్, రెన్యూవల్ తేదీలను ఈసీగా తెలుసుకోవచ్చు.