టర్కీలో భూకంపం… 18మంది మృతి

టర్కీలో భూకంపం… 18మంది మృతి

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 18మంది మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం..  టర్కీ తూర్పు ప్రాంతంలోని ఇలాజిజ్ ప్రావిన్స్ లోని సివ్ రిస్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రత 6.8గా నమోదైంది. ఇందులో 18మంది మృతి చెందగా… 500మందికిపైగా గాయాలపాలయ్యారు. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. భూమి కంపించిన తర్వాతకూడా… మరో 60సార్లు స్వల్ప ప్రకంపనలు జరిగాయని చెప్పారు. ఈ ప్రకంపనలు టర్కీ పక్కదేశాలైన సిరియా, లెబనాస్ లోనూ భూమి కంపించింది. భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు 400మంది సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొన్నారు.