రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం ఓటింగ్

రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం ఓటింగ్

రాష్ట్రపతి ఎన్నికలో 99శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 4,796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 99శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పింది. 11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎమ్మెల్యేలందరూ ఓటుహక్కు వినియోగించుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 100శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పార్లమెంటు హౌస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో 736  (ఎంపీలు727, ఎమ్మల్యేలు 9) మంది ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా..వారిలో 728 మంది (ఎంపీలు 719, ఎమ్మెల్యేలు 9) ఓటు వేశారని రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోడీ ప్రకటించారు. బీజేపీ, శివసేనకు చెందిన చెరో ఇద్దరు ఎంపీలతో పాటు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , బహుజన్ సమాజ్ వాదీ పార్టీ,ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ కు చెందిన ఎమ్మెల్యే మన్ ప్రీత్ సింగ్ రాష్ట్రపతి ఎన్నిక బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.