ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రత

ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రత

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోలింగ్​ ముగిసిన తరువాత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్​రూమ్​లకు తరలించినట్లు నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఉదయ్​కుమార్​ తెలిపారు. జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్  నియోజకవర్గాలకు సంబంధించిన 802 ​ యూనిట్లను ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఈవీఎంలను శుక్రవారం మార్కెట్ యార్డులో ఎన్నికల అబ్జర్వర్లు మితిలేశ్​మిశ్రా, సతీశ్​కుమార్, వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌రూముల్లో భద్రపరిచారు.

స్ట్రాంగ్ రూమ్​లకు మూడంచెల భద్రత కల్పించారు. స్ట్రాంగ్ రూమ్​ చుట్టుపక్కలకు ఎవరినీ అనుమతించవద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. కౌంటింగ్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా  ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో పంపించినట్లు తెలిపారు. అడిషనల్​ కలెక్టర్  కె సీతారామారావు, ఆర్వోలు కుమార్ దీపక్, వెంకట్ రెడ్డి, గోపీరాం పాల్గొన్నారు.

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినం

గద్వాల: ఈ నెల 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎన్నికల పరిశీలకుడు వసంత కుమార్ తెలిపారు. శుక్రవారం గోనుపాడు పాలిటెక్నిక్  కాలేజీలో ఈవీఎంలను రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి స్ట్రాంగ్​రూమ్​లలో భద్రపరిచి సీల్ వేశారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు సంబంధించి  ఈవీఎంలను భద్రపరిచామని తెలిపారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు ఐడీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాస్, ఆర్డీవో చంద్రకళ, ఏఎస్పీ రవి పాల్గొన్నారు.