మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక మార్పులు చేసింది. రెండు దశల్లో జరగనున్న పోలింగ్ తేదీలను వాయిదా వేసింది. తొలి దశ ఓటింగ్ ను ఒక్క రోజు, రెండో దశ పోలింగ్ ను రెండ్రోజుల చొప్పున వాయిదా వేసింది ఈసీ. తొలి దశ పోలింగ్ ఈ నెల 27న జరగాల్సి ఉండగా.. 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే రెండో దశ పోలింగ్ మార్చి 3న జరగాల్సి ఉండగా.. 5వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల కౌంటింగ్ మాత్రం మార్చి 10న జరగనుంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ లో 20 లక్షల 56 వేల 901 మంది ఓటర్లు ఉన్నారు. భద్రత సహా లాజిస్టిక్స్, ఇతర కారణాల రీత్యా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ఈసీ ఎన్నికల తేదీల్లో మార్పులు చేసింది. 

పంజాబ్ లోనూ ఇప్పటికే ఎన్నికల తేదీలో మార్పు చేసింది ఈసీ. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు పార్టీల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్ ను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. పంజాబ్ లో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. కాగా, యూపీలో ఏడు దశల్లో జరుగుతున్న మొదటి విడత పోలింగ్ ఇవాళ ముగిసింది.

మరిన్ని వార్తల కోసం..

పార్టీ చీఫ్ ఓటేయకుండా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

కర్ణాటకలో కాలేజీలు తెరవచ్చన్న హైకోర్టు.. కానీ కండిషన్స్ అప్లై

నలుగురు రైతుల్ని చంపినోడికి నాలుగు నెలల్లో బెయిలా?