చందా కొచ్చర్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

చందా కొచ్చర్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ICICI మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వీడియోకాన్‌ రుణాల జారీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) విచారణ ఎదుర్కొంటున్న చందాకొచ్చర్…ఇప్పటికే చాలా సార్లు ED ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ(శుక్రవారం) కొచ్చర్, ఆమె కుటుంబసభ్యుల ఆస్తులను అటాచ్ చేసింది ED. మొత్తం రూ.78 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో కొచ్చర్ పేరుతో ముంబైలోని ఖరీదైన ఫ్లాట్ తో పాటు…ఆమె భర్త దీపక్‌ కొచ్చర్ కు చెందిన కంపెనీ ఆస్తులున్నాయి.

ICICI బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ప్రధాన ఆరోపణ.  ఈ వ్యవహారంలో  ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదు చేసిన ED,CBI దర్యాప్తు చేస్తున్నాయి.