
ముంబై: తెలుగు సినిమా ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ కావ్యా థాపర్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కోసం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గురువారం రాత్రి కావ్యా థాపర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తిని కారుతో ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయ పడ్డాడు. జుహూ లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాక్సిడెంట్ గురించి విచారించే క్రమంలో వారితో వాగ్వివాదానికి దిగింది కావ్యా థాపర్. పలువురు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది.
అంతే కాకుండా ఓ పోలీసు అధికారి కాలర్ను పట్టుకుంది. దీంతో హీరోయిన్ కావ్యా థాపర్ను అరెస్టు చేసిన పోలీసులు.. జుహూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అమెను అంధేరి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. కోర్టులో వాదనలు విన్న జడ్జి హీరోయిన్ కావ్యా థాపర్ను విచారణ కోసం జ్యూడిషియల్ కస్టడీ విధించారు.
మరిన్ని వార్తల కోసం: