ఎన్నికల ఫలితాలు: ఏపీలో జగనా? బాబా?

ఎన్నికల ఫలితాలు: ఏపీలో జగనా? బాబా?

ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఐదేళ్ల చంద్రబాబు పాలనకు జనం మళ్లీ పట్టం కడతారా? లేక జగన్‌ను గద్దెనెక్కిస్తారా? ఇప్పుడు అందరిలో ఇదే ఉత్కంఠ! దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన వైసీపీ ఈసారి గెలుపు తమదేనన్న ధీమాతో ఉండగా.. వందకు వెయ్యి శాతం విజయం తమదేనని టీడీపీ చెబుతోంది. 2014లో టీడీపీ–-బీజేపీ కూటమి106 (టీడీపీ 102, బీజేపీ 4) అసెంబ్లీ స్థానాల్లో, వైఎస్సార్‌సీపీ 67 సీట్లలో గెలుపొందగా ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు. ఈసారి మొత్తం 2,118 మంది క్యాండిడేట్లు అసెంబ్లీ బరిలో నిలిచారు. దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది.

జగన్‌ సైలెంట్‌.. బాబు హడావుడి..

కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అధికారం దక్కొద్దన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే జాతీయస్థాయిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తూ ఆయన హడావుడి చేస్తుంటే..  జగన్‌‌‌‌‌‌‌‌ సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటున్నారు. ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ ముగిసిన రోజు మీడియాతో మాట్లాడటం తప్ప ఆ తర్వాత జగన్‌‌‌‌‌‌‌‌ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఇటీవల ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌ తమకు అనుకూలంగా వచ్చినా పెద్దవి విప్పలేదు. మరోవైపు చంద్రబాబు మాత్రం ఏపీలో ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటనలు మొదలు పెట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్, బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చారు. టీఎంసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌, బీఎస్పీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌‌‌‌‌‌‌‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చీఫ్ రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీతోనూ భేటీ అయ్యారు. ఎన్డీయేకు మెజారిటీ రాకుంటే మిగతా పక్షాలతో కేంద్రంలో చక్రం తిప్పాలని బాబు భావిస్తున్నారు.

జగన్‌‌‌‌‌‌‌‌కు జైకొట్టిన ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌….

ఏపీలో టీడీపీకి భంగపాటు తప్పదని ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌ అంచనా వేశాయి. లోక్​సభ సీట్లు నాలుగు నుంచి పది వరకే వస్తాయని చెప్పాయి. లగడపాటి సర్వే మినహా చాలా ఎగ్జిట్ పోల్స్ వైసీపీ వైపే మొగ్గు ఉందని తేల్చాయి. 170 సీట్లలో వైసీపీ130–133 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీపీఎస్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. టీడీపీ 43–44 సీట్లలో, జనసేన 1 స్థానంలో గెలుస్తుందని పేర్కొంది. వైసీపీ 111 నుంచి 121 స్థానాల్లో గెలవొచ్చని వీడీపీ అసోసియేట్స్ తెలిపింది. టీడీపీ 54 –60 సీట్లు రావొచ్చని పేర్కొంది. వైసీపీ126 సీట్లలో, టీడీపీ 47 సీట్లలో గెలుస్తుందని అరా సర్వే అంచనా వేసింది. జనసేన 2 నుంచి 3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్లు తెలిపింది. 25 లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లలో వైసీపీ 22, టీడీపీ 3– 5 సీట్లు గెలిచే అవకాశం ఉందంది. వైసీపీ18–20, టీడీపీ4–6 లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లు గెలుస్తాయని ఇండియా టుడే, టీడీపీ 17, వైసీపీ 8 సీట్లలో నెగ్గుతాయని టు డేస్ చాణక్య అంచనా వేసింది. ఇండియా టుడే యాక్సిస్.. వైసీపీ 19–21, టీడీపీ 4–6 సీట్లు గెలుస్తాయని తెలిపింది. వైసీసీ 13–14, టీడీపీ 10–12 సీట్లు గెలుస్తాయని న్యూస్ 18 ఇండియా, వైసీపీ 18, టీడీపీ 7 సీట్లలో నెగ్గుతాయని టైమ్స్ నౌవ్ వీఎంఆర్ అంచనా వేశాయి.