రిజిస్టరైన ఈవీలు 1.59 లక్షలు

 రిజిస్టరైన ఈవీలు 1.59 లక్షలు

న్యూఢిల్లీ:  దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి  1.59 లక్షల యూనిట్లకు పెరిగాయి. ప్రభుత్వ వాహన్ పోర్టల్ ప్రకారం, కిందటేడాది సెప్టెంబర్ నాటికి  ఇవి 1.29 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.

 ఏడాది ప్రాతిపదికన 23 శాతం గ్రోత్ నమోదయ్యింది. ఇందులో ఎలక్ట్రిక్ టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 64 వేల యూనిట్ల నుంచి 90 వేల యూనిట్లకు, ఎలక్ట్రిక్ త్రీవీలర్ల రిజిస్ట్రేషన్లు 58 వేల యూనిట్ల నుంచి 63 వేల యూనిట్లకు పెరిగాయి. ఓలా ఎలక్ట్రిక్, హీరో మోటోకార్ప్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు పడిపోగా, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ సేల్స్ పెరిగాయి.

మరిన్ని వార్తలు