హాఫ్ చైనీస్ అన్న కాన్యే..కాంప్లిమెంట్గా తీసుకున్న మస్క్

హాఫ్ చైనీస్ అన్న కాన్యే..కాంప్లిమెంట్గా తీసుకున్న మస్క్

ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్, అమెరికా ర్యాపర్ కాన్యే వెస్ట్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నియమాలను ఉల్లంఘించారంటూ కాన్యే అకౌంట్ను  ట్విట్టర్ నిలిపివేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాన్యే..ఎలన్ మస్క్ హాఫ్ చైనీస్ అంటూ కామెంట్ చేశారు. కాన్యే కామెంట్స్పై స్పందించిన మస్క్ అతడి కామెంట్ను అభినందనగా తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. 

నాజీలకు చెందిన స్వస్తిక్‌ చిహ్నాన్ని తన ప్రచార చిత్రంగా కాన్యే వెస్ట్‌ ట్వీట్‌ చేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్‌.. తమ నియమాలకు విరుద్ధంగా ఉందంటూ కాన్యే వెస్ట్‌ ఖాతాను నిలిపేసింది. ఈ క్రమంలో ఎలన్ మస్క్పై కాన్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలన్ మస్క్లో ప్రవహించే సగం రక్తం చైనాదేనా. అతడి చిన్నప్పటి ఫొటోలు చూస్తే ఈ విషయం మీకే అర్ధమవుతుంది. చర్చిలో ఇటువంటి పదాలను ఉపయోగించినందుకు నన్ను క్షమించండి’’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. క్యాప్షన్ లో తనను తాను అమెరికా భవిష్యత్ అధ్యక్షుడిగా చెప్పుకున్నాడు.