స్లీపింగ్​ సిక్​నెస్.. జీవమున్న విగ్రహాలు!

స్లీపింగ్​ సిక్​నెస్.. జీవమున్న విగ్రహాలు!

ఉత్తర అమెరికా, యూరోప్​లలో1917–1928 మధ్య ప్రాంతంలో 500 వేల మంది ఒక మిస్టీరియస్​ వ్యాధి బారిన పడ్డారు. ఈ జబ్బు వచ్చిన వాళ్లు మంచానికి పరిమితం అయ్యేవాళ్లు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. కానీ శరీరంలో ఏ భాగాన్నీ కదల్చలేరు. నోరువిప్పి మాట్లాడలేరు. అలా కొన్ని రోజులు, వారాలు లేదా నెలలు ఉన్నాక చనిపోయిన వాళ్లు కొందరైతే, బతికిన వాళ్లు మరికొందరు. ఆ బతికిన వాళ్లేమో ఇలా బతకడం కంటే ప్రాణం పోయినా బాగుండేది అనుకునేంత ఇబ్బంది పడ్డారు.

ఇదంతా చదవగానే కోమా స్టేజీ అనిపిస్తుంది. కానీ ఈ వ్యాధిని ఎన్​సెఫలైటిస్​ లెథర్కిజా(ఇ.ఎల్​.) అంటారు. వాడుక భాషలో చెప్పాలంటే స్లీపింగ్​ సిక్​నెస్​. మెడికల్​ టర్మినాలజీలో ఇలాంటి స్థితిని కెటాటోనిక్​ స్టేట్​ అంటారు. ఈ జబ్బు మొట్టమొదట యూరోప్​లో కనిపించింది. ఆ తరువాత ప్రపంచమంతటా వ్యాపించింది. ఉత్తర అమెరికా, యూరోప్, ఇండియాల్లో 1919వ సంవత్సరంలో ఎపిడమిక్​ లెవల్​కి చేరింది. త్వరలోనే దానిమీద పరిశోధనలు చేసి న్యూరలాజికల్​ డిసీజ్​గా నిర్ధారించారు. ఈ జబ్బు వచ్చిన వాళ్లలో న్యూరలాజికల్​ డిస్​ఫంక్షన్​, రెస్పిరేటరీ ఫెయిల్యూర్​ ఉండేది. బతికిన వాళ్లలో పార్కిన్సన్​ వ్యాధి లక్షణాలు లేదా న్యూరోసైకియాట్రిక్​ సమస్యలు ఉండేవి.ఈ డిసీజ్​కి కారణాన్ని 1919లో తెలుసుకోగలిగారు. లక్షల మంది ప్రజలు జ్వరం, తలనొప్పి, మందగించిన చూపు, డబుల్​ విజన్, అప్పర్​ బాడీ వీక్​నెస్​, కండరాల నొప్పి వంటి లక్షణాల బారిన పడ్డారు. ఈ లక్షణాలతో పాటు ఆలోచనా శక్తి తగ్గడం, కదలికలు తగ్గిపోవడం, డబుల్​ విజన్, డెలీరియమ్, పెరాలసిస్​ వంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి. కొందరిలో పైన చెప్పిన లక్షణాలు ఒకేసారి కాకుండా నెమ్మదిగా పెరిగాయి, కానీ కొందరిలో మాత్రం ఎటువంటి వార్నింగ్​ సిగ్నల్స్​ లేకుండానే పక్షవాతం​ బారిన పడ్డారు.

చచ్చి బతికినట్టు

కదలికలు నెమ్మదించినప్పుడు చాలామంది అదో జబ్బు అనే విషయం గుర్తించలేకపోయాం. ఏదో ఒకరోజు పూర్తిగా కదల్లేని స్థితికి వస్తారు. అప్పుడు కానీ విషయం తెలిసేది కాదు. ఇ.ఎల్. ఎటువంటి వార్నింగ్​ లేకుండానే దాడిచేస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన కొందరు ‘‘ఆ టైంలో ఫ్రీజ్​ అయ్యాం. కానీ మా చుట్టూ ఏం జరుగుతుందనే విషయం బాగా తెలిసింది. బలవంతంగా ఎవరో కదలనీయకుండా పట్టుకున్నట్టు లేదా బ్రెయిన్​ సిగ్నల్స్​ ఆపేసినట్టు అనిపించిందని చెప్పారు. కొందరు కొన్నాళ్ల తరువాత మామూలుగా లేచి తిరిగారు. కొందరు మాత్రం జీవితంలో కదల్లేదు.  ఏదో పనిచేస్తున్నప్పుడో, పడుకుని ఉన్నప్పుడో కదలకుండా ఉండే ఈ పరిస్థితి గంటలు, రోజుల నుంచి వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులే ఉండేది. కొన్ని కేసుల్లో అయితే ఏండ్ల తరబడి బిగుసుకుపోయారు. ముందుగా ఎటువంటి లక్షణాలు లేకుండా దీని బారిన ఎందుకు పడుతున్నారనే విషయం తెలుసుకునేందుకు సైంటిస్ట్​లు పరిశోధనలు చేస్తున్నారు. వ్యాధి విజృంభించినప్పుడు చేసిన పరిశోధనల్లో స్ట్రెప్టోకోకస్​ అనే బ్యాక్టీరియా స్పెషల్​ స్ట్రెయిన్​ ఇది అని కనుగొన్నారు. వాస్తవానికి శీతాకాలంలో  జలుబు, గొంతునొప్పులకు కారణమయ్యే బ్యాక్టీరియా ఇది. ఆ బ్యాక్టీరియానే అసాధారణంగా బ్రెయిన్​ ఇన్​ఫ్లమేషన్​(మెదడు వాపు)కు కారణం అయ్యి మోటార్​ ఫంక్షన్స్​ మీద ప్రభావం చూపించి మనుషుల్ని మంచానికి కట్టిపడేస్తుంది అని తేల్చారు.

మళ్లీ ఇలా వెలుగులోకి...

పన్నెండేండ్ల అమ్మాయి ఒక కాన్సర్ట్​కు వెళ్లాలని బయల్దేరింది. కొంచెం దూరం వెళ్లాక శరీరంలో ఒకవైపు పక్షవాతం వచ్చింది. ఇదేంటి అకస్మాత్తుగా ఇలా అయిందని ఆలోచించే లోపే శరీరంలో రెండో వైపు కూడా పక్షవాతానికి గురైంది. బాడీ అంతా పారలైజ్​ అయిన అరగంటలో ఆ అమ్మాయి నిద్రలోకి జారిపోయింది. ఆ తరువాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి చనిపోయింది. అకస్మాత్తుగా ఇలాగెందుకు అయిందని రీసెర్చ్​ చేస్తుంటే కొన్నేండ్ల క్రితం ప్యాండెమిక్​ అయ్యి సడన్​గా మాయమైన మెడికల్​ మిస్టరీ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మెడికల్ మిస్టరీ ప్రపంచాన్ని ఇంకా కలవరపెడుతూనే ఉంది.  అక్కడక్కడ మళ్లీ కనిపిస్తోంది. 2004 లో ఎన్​సెఫలైటిస్​ లెథర్జికా బారిన పడిన 20 మందిని స్టడీ చేసి నిద్ర మహమ్మారి రోగం రిస్క్​ ఇంకా పోలేదని చెప్పారు సైంటిస్ట్​లు.ఈ జబ్బున పడి కొన్ని దశాబ్దాల నిద్ర తరువాత మేలుకున్న పేషెంట్ల గురించి 1973లో ‘అవేకెనింగ్స్’​ అనే పుస్తకాన్ని రాశాడు ఆలివర్​ సాక్స్​ అనే న్యూరాలజిస్టు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని1990లో ‘అవేకనింగ్’​ అనే సినిమా తీశారు. అందులో రాబర్ట్​ డి నీరో, రాబిన్​ విలియమ్స్​ నటించారు. ఈ సినిమా అప్పట్లో అకాడమీ అవార్డ్​కు నామినేట్​ అయింది.