
ట్యాంక్ బండ్ వద్ద రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారం ముగిసింది. ఓవైపు వర్షం కురుస్తున్నా ట్రాక్‌పై కార్లు రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లాయి. చివరిరోజు కూడా అభిమానుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం స్పాన్సర్లు, నిర్వాహకులు, వారికి సంబంధించిన వారే ఎక్కువగా కనిపించారు. వీఐపీ గ్యాలరీలు వెలవెలబోయాయి. మొత్తంగా 400 మంది ప్రేక్షకులకు మించి రాలేదు. ఫైనల్ రేసింగ్ చూసేందుకు సినీనటుడు రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వచ్చారు. పోటీల్లో పాల్గొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ లీడర్కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొడుకు అనిందిత్రెడ్డితో కలిసి ఫొటోలు దిగి సందడి చేశారు. నటుడు నాగచైతన్య పోటీలు చూసేందుకు వచ్చారు. ఫిబ్రవరిలో ఇదే వేదికగా ఫార్ములా–ఈ రేసింగ్ జరగనుంది.
- వెలుగు, హైదరాబాద్