కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలన్నింటి పై కోర్టులను ఆశ్రయిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన…కేసీఆర్ అవినీతి చిట్టా అంతా మా చేతిలో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలకు ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేత, LRS లోపాలపై ఉద్యమిస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను, అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. త్వరలో కేసీఆర్ అవినీతి పై సాక్ష్యాలతో కోర్టు లో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు బండి సంజయ్.
