పీఎఫ్​ నుంచి హోంలోన్​ ఇలా..

పీఎఫ్​ నుంచి హోంలోన్​ ఇలా..

న్యూఢిల్లీ: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా ఈపీఎఫ్​ఓ అనేది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న వెల్ఫేర్​ స్కీమ్.  దీనిద్వారా ఉద్యోగులు నెలకు కొంత మొత్తాన్ని పొదుపు చేయవచ్చు. అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా చెల్లిస్తాడు. ఈ మొత్తానికి ఏటా వడ్డీ జమ అవుతుంది. పీఎఫ్​ సభ్యులు అత్యవసర సమయాల్లో పీఎఫ్ కార్పస్ నుండి పాక్షికంగా లేదా ముందస్తుగా కొంత సొమ్మును విత్​డ్రా చేసుకోవచ్చు. ఇల్లు కొనడం, ఆరోగ్య సమస్యలు, హోం లోన్​ వంటి వాటికోసం డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఆర్‌‌‌‌బీఐ రెపో రేటు పెరిగిన తర్వాత హోంలోన్ వడ్డీ రేట్లు ఇటీవల పెరిగాయి. కొత్త వారితోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు కొన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో హోంలోన్లపై నెలవారీగా చెల్లించే కిస్తీ మొత్తం పెరిగింది. పెరుగుతున్న వడ్డీ రేట్లను తట్టుకోవడానికి బారోవర్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నుండి వచ్చిన డబ్బుతో హోంలోన్లను పూర్తిగా లేదా పాక్షికంగా  చెల్లించవచ్చు.  

కొన్ని షరతులు ఉన్నాయ్​...

ఈపీఎఫ్ స్కీమ్‌‌‌‌లోని సెక్షన్ 68బీబీ ప్రకారం హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌‌‌‌డ్రా చేసుకోవచ్చు. అయితే సంబంధిత ఇల్లు వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా గానీ పీఎఫ్ సభ్యుని పేరుపై ఉండాలి. హోంలోన్ కోసం అభ్యర్థి తప్పనిసరిగా కనీసం పదేళ్ల పాటు పీఎఫ్ చెల్లించి ఉండాలి. ఐదు సంవత్సరాలపాటు నిరంతరాయంగా డబ్బు కడితేనే, తీసుకున్న పీఎఫ్ మొత్తానికి పన్ను ఉండదు. హోమ్ లోన్ వడ్డీ ఈపీఎఫ్ వడ్డీ కంటే ఎక్కువగా ఉంటే మీ వడ్డీని తగ్గించుకోవచ్చు. మీ ఈపీఎఫ్​పై వచ్చే వడ్డీ మీ హోంలోన్​ వడ్డీ కంటే ఎక్కువ లేదా సమానమైనట్లయితే మీరు మీ ఈపీఎఫ్ కార్పస్‌‌‌‌ను అలాగే ఉంచుకోవచ్చు.

1. ఈపీఎఫ్​ఓ ఈ–సేవా పోర్టల్‌‌‌‌కి లాగిన్ అయి, మీ యూఏఎస్​, పాస్‌‌‌‌వర్డ్,  క్యాప్చా కోడ్‌‌‌‌ని ఎంటర్​ చేయండి.
2. ఇప్పుడు 'ఆన్‌‌‌‌లైన్ సర్వీసెస్​' ట్యాబ్​పై క్లిక్​ చేసి మీ బ్యాంక్ వివరాలను ఎంటర్​ చేయండి.
3. నిబంధనలు,  షరతులను పూర్తిగా చదవండి. ఈపీఎఫ్ పొదుపు డబ్బును వెనక్కి తీసుకోవడానికి  కారణాన్ని తెలియజేయండి
4. మీ చిరునామా,  ఇతర వివరాలను ఎంటర్​ చేసి, డాక్యు మెంట్​ను అప్‌‌‌‌లోడ్ చేయండి. ఇప్పుడు టర్మ్స్​& కండిషన్స్​ను అంగీ కరించి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌‌‌లో ఆధార్ ఓటీపీని పొందండి. ఇది ఎంటర్​చేస్తే అప్లికేషన్ ​సబ్​మిషన్​ పూర్తవుతుంది.