ఆగస్టులో ఈక్విటీ ఎంఎఫ్​లలో.. రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

ఆగస్టులో ఈక్విటీ ఎంఎఫ్​లలో.. రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

వెలుగు బిజినెస్​ డెస్క్​: ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. ఆగస్టు 2023లో ఈక్విటీ మ్యూచువల్​ పండ్స్​లో రూ. 20,245.26 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు పెట్టారు.  జులై నెలలో ఈ పెట్టుబడులు రూ. 7,625.96 కోట్లే. మ్యూచువల్​ ఫండ్స్​లోని చాలా కేటగిరీల స్కీములలో పెట్టుబడులు పెరిగాయి.  లార్జ్​క్యాప్​ ఫండ్స్​, ఫోకస్డ్​ ఫండ్స్​, ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ మాత్రమే పెట్టుబడులను రాబట్టుకోలేకపోయాయి.  సెక్టోరల్​ కేటగిరీ మ్యూచువల్​ ఫండ్స్​ స్కీములలోకి రూ. 4,805.81 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత మూడు నెలలుగా ఈ సెక్టోరల్​ కేటగిరీ మ్యూచువల్​ ఫండ్స్​ స్కీములలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి.   స్మాల్​ క్యాప్​ కేటగిరీ మ్యూచువల్​ ఫండ్స్​ స్కీములు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ కేటగిరీ స్కీములలో ఆగస్టులో రూ. 4,264.82 కోట్లు, జులైలో రూ. 4,171.44 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఫోకస్డ్​ ఫండ్స్​ నుంచి రూ. 471.10 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. కిందటి అయిదు నెలల నుంచి ఫోకస్డ్​ ఫండ్స్​ స్కీముల నుంచి తమ డబ్బులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఎక్కువైంది. లార్జ్​ క్యాప్​ కేటగిరీ స్కీముల నుంచి కూడా రూ. 348.98 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. వరసగా నాలుగు నెలల నుంచి ఈ కేటగిరీ నుంచి విత్​డ్రాయల్స్​కే ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు.

డెట్​మ్యూచువల్​ ఫండ్స్​.

డెట్​మ్యూచువల్​ ఫండ్స్​ కేటగిరీలోని ఓవర్​నైట్​ ఫండ్స్​, ఫ్లోటర్​ ఫండ్స్​, డైనమిక్​ బాండ్​ ఫండ్స్​, కార్పొరేట్​ బాండ్​ ఫండ్స్​, లాంగ్​ డ్యూరేషన్​ ఫండ్స్​, గిల్ట్​ ఫండ్స్​, డైనమిక్​ బాండ్​ ఫండ్స్​లోకి ఇన్​ఫ్లోలు రికార్డయ్యాయి. మనీ మార్కెట్​ పండ్స్​లో మాత్రం చాలా తక్కువగా రూ. 91.49 కోట్లు వచ్చాయి. ఆగస్టులో లిక్విడ్​ ఫండ్స్​నుంచి భారీగా రూ. 26,823.68 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ఈ లిక్విడ్​ ఫండ్స్​జులైలో రూ. 51,938.41 కోట్ల ఇన్​ఫ్లోలను రికార్డు చేశాయి.అల్ట్రా షార్ట్​ డ్యూరేషన్​ ఫండ్స్​ నుంచి రూ. 4,123 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి 
తీసుకున్నారు. 

ఓవర్​నైట్​ ఫండ్స్​.

డెట్​మ్యూచువల్​ ఫండ్స్​ కేటగిరీలోని ఓవర్​నైట్​ పండ్స్​ అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ కేటగిరీ ఫండ్స్​లోకి రూ. 3,158.37 కోట్లు వచ్చాయి.  ఫ్లోటర్​ ఫండ్స్​లోకి రూ. 2,324.61 కోట్లు ఆగస్టులోనూ, రూ. 2000.49 కోట్లు జులైలోనూ ఇన్వెస్టర్లు పెట్టుబడులుగా పెట్టారు. హైబ్రిడ్​ కేటగిరీ ఫండ్స్​లోకి కూడా ఆగస్టులో పెట్టుబడులు వచ్చాయి. జులై నెలలో ఈ కేటగిరీలో పెట్టుబడులు రూ. 12,420.74 కోట్లయితే, ఆగస్టులో ఈ మొత్తం రూ. 17,081.68 కోట్లకు పెరిగింది. ఆర్బిట్రేజ్​ ఫండ్స్​లోకి అత్యధికంగా రూ. 9,482.65 కోట్లు వచ్చి చేరాయి. డైనమిక్​ ఎసెట్​ యాలొకేషన్ అడ్వాంటేజ్​ పండ్స్​లో రూ. 3,616.01 కోట్లను ఇన్వెస్ట్​ చేశారు. ఇండెక్స్​ఫండ్స్​, ఈటీఎఫ్​లలోకి ఆగస్టు నెలలో ఇన్వెస్టర్లు రూ. 4,535.18 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. 

మొత్తం ఏయూఎం రూ. 46.63 లక్షల కోట్లు..

ఆగస్టు చివరి నాటికి మొత్తం అసెట్స్​ అండర్​ మేనేజ్​మెంట్​ రూ. 46.63 లక్షల కోట్లకు చేరాయి. జులై నెలలోని రూ. 46.37 లక్షల కోట్ల కంటే ఇది 0.56 శాతం ఎక్కువ. ఆగస్టు 2023లో 14 ఓపెన్​–ఎండెడ్​ న్యూ ఫండ్ ఆఫరింగ్స్​ వచ్చాయి. ఇవన్నీ కలిపి రూ. 7,343 కోట్లను సమీకరించాయి. ఒకే ఒక్క క్లోజ్​–ఎండెడ్​ ఫండ్​ రూ. 188 కోట్లను సేకరించింది.