హైదరాబాద్, వెలుగు: చిన్నారుల్లో దగ్గర చూపు (మయోపియా) సమస్యను తగ్గించడానికి ఎసిలర్ లక్సోటికా ప్రవేశపెట్టిన ఎసిలర్ స్టెల్లెస్ లెన్స్కు ఎఫ్డీఏ అనుమతి లభించింది. ఈ లెన్స్ రెండేళ్ల కాలంలో మయోపియా తీవ్రతను సగటున 71 శాతం తగ్గించినట్లు క్లినికల్ డేటా వెల్లడించింది.
పట్టణ ప్రాంతాల్లో 2050 నాటికి 50 శాతం చిన్నారులు ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. సాధారణ లెన్సులు కేవలం చూపును సవరిస్తాయి కానీ సమస్య తీవ్రతను అదుపు చేయలేవు. ఎఫ్డీఏ గుర్తింపు వల్ల ఈ మెడికల్టెక్నాలజీపై వైద్యులు, తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుందని సంస్థ పేర్కొంది.

