షాద్నగర్ సెగ్మెంట్కు ఈవిఎంలు వచ్చేశాయ్..!

షాద్నగర్ సెగ్మెంట్కు ఈవిఎంలు వచ్చేశాయ్..!

రంగారెడ్డి:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను డిస్ట్రీబ్యూట్ చేస్తోంది. అందులో భాగంగా బుధవారం (అక్టోబర్25) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీ (84) కు సంబంధించిన 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాలు వచ్చేశాయి. ఆర్డీవో వెంకట మాధవరావు, ఫరూఖ్ నగర్ ఎమ్మార్వో పార్థసారధి ఈవీఎం లను షాద్ నగర్ ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపర్చారు. స్థానిక అన్ని రాజకీయ పార్టీల నేతలు సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో పెట్టించారు. ఈ సందర్బంగా షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 252 పోలింగ్ బూత్ లు ఉన్నాయి.. వీటికోసం 310 ఈవీఎం యంత్రాలు స్ట్రాంగ్ రూంలలో భద్ర పర్చామని తెలిపారు. కొన్ని బూత్ లకు సంబంధించి అదనంగా ఈవీ ఎం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.