కరోనా దెబ్బతీసినా కొత్త పన్నులు వేయలేదు

కరోనా దెబ్బతీసినా కొత్త పన్నులు వేయలేదు

న్యూఢిల్లీ: కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడినప్పటికీ.. ప్రజలపై కొత్తపన్నులు వేయలేదన్నారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ఆర్థిక బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2022 మరియు 23 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెటరీ ఎక్సర్ సైజ్ పూర్తైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టిన 39 అధికారిక సవరణలకు సభ ఆమోదం తెలపగా.. విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు మూజువాణి ఓటుతో వీగిపోయాయి. 
కోవిడ్ తర్వాత 32 దేశాలు ప్రజలపై పన్నులు వేశాయని చెప్పారు నిర్మలా సీతారామన్. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ పన్ను ద్వారా రూ.7 లక్షల కోట్లకుపైగా వసూలయ్యాయన్నారు. టాక్స్ బేస్ విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే గొడుగులపై కస్టమ్స్ డ్యూటీ విధించడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్.. ఎంఎస్ఎంఈల దేశ వాళీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

 

ఇవి కూడా చదవండి

రాజ్యాంగ పరిరక్షణ కోసం యుద్ధభేరి మహాసభ

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్