
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) కరోనా లక్షణాలతో చనిపోయారు. ఆయన మరణానికి కారణాలను నిర్ధారించేంతవరకు అతని కుటుంబ సభ్యులు వేచిఉండలేదని, కరోనా ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వారు ఇష్టపడలేదని సోర్సెస్ పేర్కొన్నాయి. దీంతో దేశంలో కరోనా సింప్టమ్స్ తో చనిపోయిన రెండో ప్రొఫెషనల్ ప్లేయర్ రియాజ్ అని అధికార వర్గాలు వెల్లడించాయి. లెగ్ స్పిన్నర్ అయిన రియాజ్.. 1987 నుంచి 2005 వరకూ 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. రిటైర్‌మెంట్ తర్వాత ఆయన మొయిన్ ఖాన్ క్రికెట్ ఆకాడమీలో కోచ్‌గా చేరారు. రియాజ్ కంటే ముందు మరో పాకిస్తాన్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కూడా కరోనా సోకి ఏప్రిల్ లో పెషావర్ లో ప్రాణాలు కోల్పోయారు. అయితే, రియాజ్ కు కరోనా రావడంతో క్వారంటైన్ లో ఉండనున్నారని కొద్దిరోజుల కిందట ఫార్మర్ టెస్ట్ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ వెల్లడించారు. గత నెలలో ఈద్‌కు ముందు లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించినప్పటి నుండి పాక్ లో కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటివరకు 80,463 మంది వైరస్ బారిన పడ్డారు. 1,688 మంది చనిపోయారు.