పరీక్ష సమయం తగ్గించండి

పరీక్ష సమయం తగ్గించండి
  • యూనివర్సిటీలకు యూజీసీ గైడ్‌లైన్స్‌
  • జులైలో పరీక్షలు పెట్టాలని సూచన

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ సెమిస్టర్‌‌ ఎగ్జామ్స్‌కు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) యూనివర్సిటీలకు కొన్ని గైడ్‌లైన్స్‌ పాస్‌ చేసింది. చివరి సెమిస్టర్‌‌ వాయిదా పడ్డ వాళ్లకు జులైలో ఎగ్జామ్స్‌ పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరీక్ష సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు తగ్గించాలని ఆదేశించింది. ఎవరి వీలు తగ్గట్లుగా ఎగ్జామ్స్‌ను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని యూనివర్సిటీలకు చెప్పింది. “ తక్కువ టైంలో సింపుల్‌గా ప్రాసెస్‌ ముగించే విధంగా పరీక్షలు నిర్వహించుకునేలా యూనివర్సిటీలు ప్లాన్‌ చేసుకోవాలి. ఎగ్జామ్‌ టైంను 3 నుంచి 2 గంటలకు తగ్గించుకోవాలి. పరీక్షలు నిర్వహించేటప్పుడు కచ్చితంగా సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలి” అని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ పరిస్థితి ఇంతే దారుణంగా ఉండి పరీక్షలు నిర్వహించలేని పక్షంలో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్క్‌, పోయిన సెమిస్టర్‌‌లో పర్ఫామెన్స్‌ను బట్టి మార్కులు ఇవ్వాలని యూజీసీ చెప్పింది. ఫస్ట్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు మాత్రం పూర్తిగా ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ బేస్‌గా ఇవ్వాలని చెప్పింది. స్టూడెంట్స్‌ ఆరోగ్యం కంటే ఏదీ తమకు ముఖ్యం కాదని, అందుకే ఈ విధంగా ఆదేశాలు జారీ చేశామని చెప్పింది.