కల్తీ మద్యం బాటిళ్లపై స్టిక్కర్లు ఇలా తయారు చేస్తున్నారు : మిషన్లు సీజ్ చేసిన అధికారులు

కల్తీ మద్యం బాటిళ్లపై స్టిక్కర్లు ఇలా తయారు చేస్తున్నారు : మిషన్లు సీజ్ చేసిన అధికారులు

హైదరాబాద్: తీగలాగితే డొంకంతా కదిలింది..స్వాధీనం చేసుకున్న మద్యం, లభించిన ఆధారాలతో హైదరాబాద్లోని కుషాయిగూడలో కల్తీ మద్యం తయారీగుట్టు బయటపడింది. కల్తీ మద్యానికి అంటించే నకిలీ ఎక్సైజ్ లేబుళ్లను తయారు చేసే మెషిన్లను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ టీం సీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. 

మంగళవారం(ఆగస్టు26) కుషాయిగూడలో నకిలీ లేబుల్స్ తయారు చేసే యంత్ర సామాగ్రిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ఎటీం అంజిరెడ్డి బృందం కుషాయిగూడలో స్వాధీనం చేసుకుంది. మద్యం లేబుల్స్ మిషన్లను పట్టుకున్నారు.15 రకాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

►ALSO READ | ఇంటి వరండాలో ఆడుకుంటుండగా..చిన్నారిపై పిచ్చికుక్క దాడి.. తీవ్రగాయాలు

హుజూర్ నగర్లోని కల్తీ మద్యం స్వాధీనం అనంతరం అక్కడ లభించిన ఆధారాలు, లేబుల్స్ ను పరిగణనలోకి తీసుకొని ఎస్ టీ ఎఫ్ ఎటీం అంజిరెడ్డి బృందం తనిఖీలు నిర్వహించింది. 

కుషాయిగూడలోని శివసాయి నగర్ కాలనీ నాగార్జున కాలనీలో ఈ ఫ్యాక్టరీ ఈ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్లుగా గుర్తించారు. రహస్యంగా మద్యం లేబుల్స్ ను తయారు యూనిట్ ను అంజిరెడ్డి బృందం స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ నిర్వాహకులు నవీన్ గౌడ్ ,నివావత్ రాజేష్ లను అరెస్ట్ చేశారు.