పవన్ కామెంట్స్ వ్యక్తిగతం.. మా సినిమా వైసీపీ వాళ్లకూ నచ్చుతది

పవన్ కామెంట్స్ వ్యక్తిగతం.. మా సినిమా వైసీపీ వాళ్లకూ నచ్చుతది

‘మనుషుల గురించో, రాజకీయాల గురించో తీసిన సినిమా కాదు ‘రిపబ్లిక్’. ప్రతి మనిషిలో ఉన్న మనస్సాక్షితో ఇంటరాక్ట్ అవుతూ చేసిన సినిమా’ అంటున్నారు దేవ కట్టా. సాయితేజ్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదలవుతోంది.  ఈ సందర్భంగా దేవ ఇలా ముచ్చటించారు.
 

  • వెన్నెల, ప్రస్థానం సినిమాలు చేసేటప్పుడు నాకు రిసోర్సెస్ తక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ. కానీ తర్వాత కమర్షియల్ లెక్కలొచ్చేశాయి. ‘ప్రస్థానం’ సక్సెస్ కాకపోవడానికి కామెడీ ట్రాక్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడమేనని నన్ను కన్విన్స్ చేసి ‘ఆటోనగర్ సూర్య’లో ఆ చెత్త పెట్టారు. ప్రేక్షకులు తిప్పి కొట్టారు. అవేవీ లేకుండా నేను ఓన్ చేసుకుని తీసిన సినిమా ‘రిపబ్లిక్’. ఓ  నిజాయితీపరుడైన బ్యూరోక్రాట్ కథ ఇది. 
  • నా అజ్ఞానమే ఈ సినిమా తీయడానికి స్ఫూర్తి. మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. చదువుకున్న వ్యక్తిగా సొసైటీ గురించి నాకే తెలియనప్పుడు సామాన్యుడికి ఏం అర్థమవుతుంది అనే దానిపై స్టడీ చేసి ఈ కథ తయారుచేశాను. అనుకోకుండా తేజ్‌‌కి స్టోరీ లైన్‌‌ చెబితే రిలేట్ అయ్యాడు. తనతోనే తీయాలని మాట తీసుకున్నాడు. మేకింగ్‌‌లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. 
  • ప్రతి డైలాగ్ ఓ ఆలోచన. ఆలోచన ఎంత బలంగా ఉంటే డైలాగ్ అంత పదునుగా ఉంటుంది. ఎవరినైనా వ్యక్తిగతంగా దూషిస్తే బాధపడతారు. ఏదైనా నొప్పించకుండా చెప్పాలి. అలాగే చెప్పాం. పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చనే భావన తప్పు. బ్యూరో క్రాట్స్, న్యాయవ్యవస్థలపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే పాయింట్‌‌ని చూపించాం.  
  • ‘కాక్కముట్టై’ అనే తమిళ చిత్రం చూసి ఐశ్వర్యా రాజేష్‌ని తీసుకున్నాను. అద్భుతంగా నటించింది. రమ్యకృష్ణ పాత్రలో మొదట భారతీరాజా, మహేంద్రన్ లాంటి డైరెక్టర్స్‌‌ని అనుకున్నాను. కానీ ఆ క్యారెక్టర్‌‌‌‌కి ఓ లేడీ పొలిటీషియన్ అయితే బాగుంటుందన్నాడు తేజ్. విజయశాంతిని తీసుకుందామంటే పాలిటిక్స్‌‌లో ఉన్నారు కనుక ఆ ప్రభావం ఉంటుందని రమ్యకృష్ణకి ఫిక్సయ్యాం. చాలా అద్భుతంగా నటించారామె. 
  • ప్రీ రిలీజ్​ వేడుకలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. మనసులో ఉన్నది దాచుకోకుండా మాట్లాడటం ఆయన నైజం. ఆ వ్యాఖ్యల ప్రభావం మా సినిమాపై ఉంటుందనుకోను. వైసీపీ వాళ్లకి కూడా నచ్చేలా ఉంటుందీ సినిమా.
  • యాక్సిడెంట్ తర్వాత తేజ్‌‌తో మాట్లాడాకే  రిలీజ్ డేట్‌‌ని ఫైనల్ చేశాం. తను ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ కూడా చూశాడు. పూర్తిగా కోలుకునే వరకు ఐసొలేషన్‌‌లో ఉంటేనే మంచిద‌‌ని ఫీలయ్యాం. కోలుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. కొద్దిగా ఫుడ్‌‌ కూడా తీసుకుంటున్నాడు. పూర్తిగా రిక‌‌వ‌‌ర్ అవ‌‌డానికి టైమ్ పట్టుద్ది. 
  • చంద్రబాబు, వైఎస్ఆర్​ల లైఫ్ స్టోరీతో  ‘ఇంద్రప్రస్థం’ అనే మూవీ తీయాలనుకున్నాం. ‘గాడ్‌‌ఫాదర్’ రేంజ్‌‌లో మూడు భాగాలు ప్లాన్ చేశాం. తర్వాత రెండు భాగాలుగా కుదించా. వెబ్ సిరీస్​గానూ తీయొచ్చు. భారీ కాస్టింగ్ అవసరం. పట్టాలెక్కించడానికి ఇంకా టైమ్ పడుతుంది.
  • బాధలో, ఫ్రస్ట్రేషన్‌‌లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ‘డైనమైట్’ సినిమా చేయడం. నేను తొమ్మిది రోజులే వర్క్ చేశా. తర్వాత వాళ్లే షూట్ చేసుకున్నారు. కానీ రిజల్ట్ నా అకౌంట్‌‌లో పడింది. తర్వాత దర్శకుడిగా ఇతరుల నమ్మకాన్ని సంపాదించుకోడానికి చాలా టైమ్ పట్టింది. 
  • ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ రేంజ్ లో ‘బాహుబలి: బిఫోర్‌‌ ద బిగినింగ్’ వెబ్​ సిరీస్​ని ప్లాన్ చేశాం. కానీ అలాంటి గొప్ప ప్రాజెక్ట్ ఒకరిద్దరు డైరెక్టర్స్‌‌తో ఏడాది, రెండేళ్లలో చేయలేం. యేళ్ల తరబడి కథ, స్క్రీన్ ప్లేకి టైమ్ కేటాయించారు కనుకే  ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఆ స్థాయిలో మెప్పించింది. మేకింగ్‌‌కి కూడా హై లెవెల్ టెక్నికల్ టీమ్ ఎంతో టైమ్ ఇన్వెస్ట్ చేస్తేనే ఔట్​పుట్​ అంత గొప్పగా వస్తుంది. మా లైఫ్ అంతా ఆ ఒక్క ప్రాజెక్ట్‌‌కే వెచ్చించలేమని నేను, ప్రవీణ్ సత్తారు అర్థం చేసుకుని రాసిందంతా నెట్‌‌ఫ్లిక్స్ దగ్గర పెట్టేసి బయటికొచ్చేశాం.

 

మరిన్ని వార్తల కోసం: 

మందు మానలేక గొంతు కోసుకుని డాక్టర్‌‌ సూసైడ్​

బరువు పెరగడం అంత ఈజీ కాదు!

నీది తాలిబాన్ కల్చర్.. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో హత్యలు జరిగాయ్