పాకిస్తాన్ గగనతలాన్ని వాడొద్దు: అమెరికా

పాకిస్తాన్ గగనతలాన్ని వాడొద్దు: అమెరికా

పాకిస్తాన్ గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని అమెరికా నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీనికి సంబంధించి  US ఏవియేషన్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఎయిర్ లైన్స్ సంస్థలకు, వాటిల్లో పనిచేసే పైలెట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాక్ ఎయిర్ స్పేస్ ను వాడటం రిస్క్ అని.. తీవ్రవాదులు, మిలిటెంట్ కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపింది. అంతేకాదు విమానాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయంది యూఎస్.

యూఎస్ పౌర విమానయాన కార్యకలాపాలకు పాకిస్తాన్ గగనతలంపై ఇబ్బందులు కలిగే అవకాశముందని అంచనా వేసిన FAA,  ‘నోటామ్’ జారీ చేసిందని అమెరికా అధికారులు తెలిపారు. డిసెంబర్ 30 తేదీన ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది అన్ని యూఎస్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థలకు, పైలెట్లకూ వర్తిస్తుందని చెప్పింది.