పీట్రాన్​ ప్లాంట్‌ విస్తరణ.. ఫెస్టివల్​ ఆఫర్లు కూడా ఆరంభం

పీట్రాన్​ ప్లాంట్‌ విస్తరణ.. ఫెస్టివల్​ ఆఫర్లు కూడా ఆరంభం

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రానిక్స్​, ఆడియో ప్రొడక్టులు తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ పీట్రాన్​ విస్తరణకు రెడీ అయింది. నాచారంలోని ప్లాంటును విస్తరిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఇది 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, నెలకు ఇక్కడ 3.5 లక్షల యూనిట్లు తయారవుతున్నాయి. విస్తరణ కోసం మరో 80 వేల చదరపు అడుగుల జాగాను కేటాయిస్తారు. కొత్తగా యంత్రాలను అమర్చడం వల్ల ప్రొడక్షన్​ సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లకు పెరుగుతుందని సంస్థ సీఈఓ అమీన్ ​ఖ్వాజా చెప్పారు. సిబ్బంది సంఖ్యను 350 నుంచి వెయ్యికి పెంచుతామని వివరించారు.

హైదరాబాద్​లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘విస్తరణతో పాటు మార్కెటింగ్​, ఆర్ ​అండ్ ​ డీ అవసరాల కోసం త్వరలో రూ.30 కోట్లు సేకరించనున్నాం. మేం గత ఆర్థిక సంవత్సరం రూ.147 కోట్ల రెవెన్యూపై రూ.1.47 కోట్ల లాభం సంపాదించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.220 కోట్ల టర్నోవర్​ను టార్గెట్​గా పెట్టుకున్నాం. ఆడియో మార్కెట్లో మాకు 5.5 శాతం వాటా ఉంది. ఫెస్టివ్​  సీజన్​ఆఫర్లలో భాగంగా బాస్ ​బడ్స్​ డ్యూను రూ.449 లకే ఇస్తున్నాం. ఆడియో, స్మార్ట్​వాచ్​లు, చార్జర్లు  తక్కువ ధరలకే అమ్ముతున్నాం. అంతేగాక రిఫ్లెక్ట్​ ప్రో స్మార్ట్​వాచ్​ను,  జెన్​బడ్స్​ వన్​ ఇయర్​బడ్స్​ను కూడా లాంచ్​ చేశాం” అని ఆయన వివరించారు.