
జంతువులు కార్లు నడపడం డిస్నీ సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఇప్పుడు దాన్ని నిజం చేసి చూపిస్తున్నారు అమెరికాలోని రిచ్ మండ్ యూనివర్సిటీ సైంటిస్టులు. డిప్రెషన్‌ను ఎదుర్కోవడంలో బిహేవియరల్ థెరపీ ఎంతవరకూ పని చేస్తుందో తెలుసుకోవడానికి రిచ్‌మండ్ యూనివర్సిటీకి చెందిన కెల్లీ లాంబెర్ట్ ఒక ప్రయోగం చేశాడు. బిహేవియరల్ థెరపీ ద్వారా ఎలుకలకు డ్రైవింగ్ నేర్పించడం సాధ్యమో కాదో ప్రయోగం చేసి తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం ఆరు ఆడ, నాలుగు మగ ఎలుకలను తీసుకుని, వాటికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలుకలు డ్రైవ్ చేయడం కోసం చిన్నచిన్న కార్లను తయారు చేశాడు. ఈ కార్లలో మూడువైపులా మూడు రాగి కడ్డీలు అమర్చాడు. ఎలుక ఏ వైపు కడ్డీని తాకితే కారు ఆ వైపు కదులుతుంది. ఎలుక ముందు ఫుడ్ ఉంచి దాన్ని చేరుకోవడానికి అది ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో గమనించాడు. ఎలుకలు తెలివిగా రాగి కడ్డీల సాయంతో ఫుడ్ వైపు తీసుకెళ్ళడం చూసి ఔరా అనుకున్నారు.