పెన్షన్​ ప్రొడక్టుల్లో పెట్టుబడికి ఇప్పుడే బెస్ట్​

పెన్షన్​ ప్రొడక్టుల్లో పెట్టుబడికి ఇప్పుడే బెస్ట్​

న్యూఢిల్లీ: ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నందున పెన్షన్​ ఆధారిత ప్రొడక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే అనువైన సమయం అని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. మనదేశంలో వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిల నుంచి రాబోయే కొద్ది నెలల్లో తగ్గుతాయని పలువురు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐసీఐసీఐ ఇన్సూరెన్స్​ చెందిన ఒక ఎక్స్​పర్టు  స్పందిస్తూ వడ్డీ రేటు మున్ముందు తగ్గుతుందని భావిస్తున్నందున, యాన్యుటీ ఉత్పత్తిని కొనుగోలు చేసే కస్టమర్లు ప్రస్తుత వడ్డీ రేటుతో తమ పెట్టుబడిని లాక్-ఇన్ చేయవచ్చని వివరించారు.  

ఇందుకోసం తమ సంస్థ ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ యాన్యుటీ ప్రొడక్టును తీసుకొచ్చిందని తెలిపారు.   క్రమబద్ధమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్‌‌‌‌‌‌‌‌ను నిర్మించడంలో ఇది పెట్టుబడిదారులకు సహాయపడుతుందని, పదవీ విరమణ తర్వాత కచ్చితంగా,  స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని ఆయన వివరించారు.