
ఢిల్లీ పర్యటనలో ఉన్న జర్మనీ విదేశాంగశాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ తో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. సమగ్ర వలస, చలనశీలత భాగస్వామ్యంపై ఎంఓయూ కుదుర్చుకున్నారు. రెండు దశాబ్ధాలకుపైగా జర్మనీతో బలమైన సంబంధం కొనసాగిస్తున్నామని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అన్నారు.
భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం గొప్ప రాజకీయ మార్పిడన్నారు. భారత్ గొప్ప చరిత్ర తనను ఎప్పుడూ కదిలిస్తుందని జర్మనీ విదేశాంగశాఖ మంత్రి అన్నారు. ఉమ్మడి విలువలు, మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి అనేక అంశాలు ఇరు దేశాల మధ్య బలమైన బంధానికి కారణమన్నారు.