తల్లితో వివాహేతర సంబంధం, కూతురిపై లైంగిక దాడి

తల్లితో వివాహేతర సంబంధం, కూతురిపై లైంగిక దాడి
  •  సీఐపై పోక్సో కేసు

హసన్‌పర్తి, వెలుగు : తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని కూతురిపై లైంగికదాడి చేసిన ఘటనలో ఓ సీఐపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. గోదావరిఖనికి చెందిన బండారు సంపత్‌ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సీఐగా పనిచేస్తున్నారు. 2022లో కేయూ పీఎస్‌లో ఎస్సైగా పనిచేసే టైంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో ఆయన వరంగల్ సీపీకి ఫిర్యాదు చేశారు.

 దీంతో అతడిని ఏఆర్‌కు అటాచ్‌ చేశారు. తర్వాత సీఐగా ప్రమోషన్‌ పొందిన సంపత్‌ గతంలో ఖమ్మం జిల్లాలో పనిచేయగా ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్నారు. తిరిగి అదే మహిళతో సంబంధం కొనసాగించడమే కాకుండా ఆమె కూతురిపై కూడా లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధిత కుటుంబ సభ్యులు గత ఫిబ్రవరిలో కేయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సంజీవ్‌ ఎంక్వైరీ చేసి సంపత్‌పై లైంగిక దాడి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.