గల్వాన్ వ్యాలీపై ఇండియా వర్సెస్ చైనా

గల్వాన్ వ్యాలీపై ఇండియా వర్సెస్ చైనా
  • 1962లో రెండు దేశాల మధ్య యుద్ధం పుట్టిందీ ఇక్కడే
  • గుప్పిట పట్టేందుకు చైనా వ్యూహం
  •  ఇప్పటికే వ్యాలీ మధ్య వరకు చైనా రోడ్డేసినట్టు శాటిలైట్‌‌ ఫొటోలు
  •  తిప్పికొడుతున్న ఇండియా

ఆక్సాయ్‌ చిన్‌‌ ప్రాంతంలోని గల్వాన్‌‌ నది, దాని వెంబడి ఉన్న లోయ. ఈ ప్రాంతం దగ్గరే ఇండియా, చైనా సోల్జర్లమధ్య కొన్ని వారాలుగా జరుగుతున్న లొల్లి ఇప్పుడు పెద్ద దైంది. మన రాష్ట్రానికి చెందిన కర్నల్‌ ‌సంతోష్‌బాబు అమరులయ్యారు. 1962లో ఇండియా, చైనా యుద్ధం కూడా గల్వాన్‌ ‌వల్లే మొదలైంది. అసలీ గల్వాన్‌ ‌వ్యాలీ, నది ఎక్కడున్నా యి? ఎందుకీ ప్రాంతంఅంత ముఖ్యమైంది? రెండు దేశాలకు ఎట్లా వ్యూహాత్మకమైనది?

ఎత్తైన ప్రాంతమని..

1956 టైమ్‌లో ఈ గల్వాన్‌‌న ది, లోయ ప్రాంతం లైన్‌ ‌ఆఫ్‌ చైనాకు పశ్చిమం వైపు ఉంది. కానీ 4 సంవత్సరాల తర్వాత లైన్‌ ‌ఆఫ్‌ చైనాకు ఎడమ వైపుకు చైనా జరిగింది. ష్యోక్‌ ‌రివర్‌‌వెంబడి ఉన్న కొండల మీదుగా బార్డర్‌ ‌లైన్‌‌ గీసింది. ఇండియా వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. ఆ కొండల మీదుగా బార్డర్‌‌ గీయడానికి చైనాకు ఓ లెక్కుంది. కొండలు ఎత్తై న ప్రాంతాలు కాబట్టి అక్కడి నుంచి ఈజీగా చుట్టూ చూడొచ్చని, సెక్యూరిటీ ప్లాన్‌‌ చేసుకోవచ్చని అనుకుంది. ఇండియా నుంచి బలగాలు ఆక్సాయ్‌ చిన్‌‌ను చేరుకోవాలంటే నది పక్కనున్న లోయ నుంచే రావాలి. కాబట్టి ఈజీగా గుర్తు పట్టొచ్చని అనుకుంది.

 1962 వార్‌ ఇందుకే

1961లో మన సీఆర్‌‌పీఎఫ్‌ పాట్రోల్‌ ‌పార్టీని పార్టీ కాంగ్‌‌కాలా ప్రాంతంలో పీపుల్స్‌‌ లిబరేషన్‌ ‌ఆర్మీ అటాక్‌ ‌చేసింది. దీంతో రియాక్టయిన ఇండియా.. గల్వాన్‌‌తో పాటు స్పంగుర్‌‌, ప్యాంగ్యాంగ్‌‌ మధ్య నున్న ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఈ ప్రాంతాలపై అజమాయిషీ కోసం జరిగిన గొడవే 1962లో ఇండియా, చైనా మధ్య యుద్ధానికి దారి తీసింది. ఈ టైమ్‌లో చైనా కంట్రోల్‌ ‌చేస్తున్న సామ్‌జుంగ్లింగ్‌‌ పోస్ట్ ‌కు కమ్యూనికేషన్‌ ‌లైన్లను మన గోర్ఖా రెజిమెంట్‌ ‌బలగాలు కట్‌‌చేశాయి. దీంతో ఇండియన్‌‌ సోల్జర్లున్న ప్రాంతాన్ని చైనా చుట్టుముట్టింది. ఈ స్టాండాఫ్‌ నాలుగు నెలలు కొనసాగింది. 4 నెలల తర్వాత చైనా ఆర్మీ ఇండియన్‌‌ ఎన్‌‌ఫోర్స్ ‌మెంట్స్ ‌పై దాడి చేసింది. సుమారు 33 మంది ఇండియన్‌ ‌సోల్జర్లు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. కంపెనీ కమాండర్‌‌ను వార్‌‌ ప్రిజనర్‌‌గా తీసుకెళ్లారు. యుద్ధంలో చైనా పైచేయి సాధించింది. 1960 నుంచి డ్రాగన్‌ ‌కావాలనుకుంటున్న ప్రాంతాన్ని ఆక్రమించేసింది. 1956 నుంచి ఇండియాలో భాగమైన ప్రాంతం చైనాకు పోయింది.

గల్వాన్‌ వ్యాలీ మధ్య వరకు చైనా రోడ్డు

ప్రస్తుత పరిస్థి తిని అంచనా వేస్తే.. గల్వాన్‌ ‌వ్యాలీ మధ్య వరకు చైనా రోడ్డేసినట్టు 2016 శాటిలైట్‌‌ ఫొటోలు చెబుతున్నాయి. ఇప్పుడా రోడ్డును మన ప్రాంతంలోకి వేశారనుకుంటున్నారు. ప్రస్తుతం లైన్‌‌ఆఫ్‌ యాక్చువల్‌ ‌కంట్రోల్‌‌కు చాలా దగ్గర్లో ఉన్న చైనా పోస్టు హెవెయ్‌తాన్‌‌. బార్డర్‌‌కు 48 కి.మీ దూరంలో ఉంది. ష్యోక్‌‌, గాల్వన్‌ ‌నదులు బార్డర్‌‌ అవతల 8 కి.మీ దూరంలో కలుస్తాయి.

ఎల్‌‌ఏసీ వెంబడి మనం రోడ్లేస్తు న్నమని..

లైన్‌ ‌ఆఫ్‌ యాక్చువల్‌‌ కంట్రోల్‌‌ వెంబడి చైనా వేసిన జింగ్జియాంగ్‌‌ , టిబెట్‌ ‌హైవే దగ్గరకు ఇండియాను రానివ్వకుండా, దాని వెంబడి ఎలాంటి పనులు చేయకుండా కొట్లాడుతోంది. అయితే ఈ మధ్య ఇండియా తన ఇన్‌‌ఫ్రా స్ట్రక్చర్‌‌ పెంచు తుండటం, రోడ్లేస్తుండటంతో చైనా దూకుడు పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో ఎల్‌‌ఏసీ వెంబడి ఉన్న ప్రాంతాలను తామే కంట్రోల్‌ ‌చేయాలని ఎత్తులు వేస్తోంది. అక్కడి ఎత్తైన ప్రాంతాలన్నీ తమవేనంటూ ఆక్రమిస్తోంది.

60 ఏండ్ల తర్వాత మళ్లీ ..

1960 నాటి బార్డర్‌ మ్యాప్‌ విషయంలో రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. 60 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ ప్రాంతంలో గొడవ పెద్దదైంది. గత నెలలో చైనా సైనికులు రూల్స ‌ను ఉల్లంఘించి ఇండియా బార్డర్‌లోకి అడుగు పెట్టారు. దీంతో రెండు వైపులా టెన్షన్స్‌‌ పెరిగాయి. ఆ తర్వాత రెండు దేశాల మిలటరీ అధికారుల మధ్య చర్చ జరగడంతో టెన్షన్స్‌‌ కొంత వరకు తగ్గాయి. కానీ తాజాగా గొడవ పెద్దదై పలువురు మరణానికి కారణమైంది.