
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేశారు భూపాలపల్లి పోలీసులు. గణపురం మండలం చెల్పూర్ టి జంక్షన్ వద్ద వరంగల్ నుండి భూపాలపల్లి వైపు వసున్న i 20 కారును అనుమానం తో ccs టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ. 10 లక్షల విలువ చేసి 5 క్వింటాల లూజు పత్తి విత్తనాలు బయటపడ్డాయి. గోనె సంచుల్లో తరలిస్తున్న ఆ విత్తనాలు నకిలీవి అని వ్యవసాయ అధికారి ధ్రువీకరించడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, కారుతొ పాటు 5 సెల్ ఫోన్ లు సీజ్ చేశారు.