టీకాలపై అబద్ధపు ప్రచారం.. అసలు నిజాలు ఇవే!

టీకాలపై అబద్ధపు ప్రచారం.. అసలు నిజాలు ఇవే!
  • 7 అంశాలపై వివరణతో ప్రకటన విడుదల చేసిన కేంద్రం  

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చిన్నపిల్లలకు కరోనా టీకాల నుంచి విదేశీ టీకాలకు ఆమోదం వరకూ ప్రధానంగా 7 అబద్ధాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. వక్రీకరించిన స్టేట్ మెంట్లు, సగం నిజాలు, పచ్చి అబద్ధాలతో ఈ ప్రచారం జరుగుతోందని, అసలు నిజాలు ఇవీ.. అంటూ సమగ్ర వివరణతో గురువారం కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్), నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్ ఈ ప్రకటనను రూపొందించారు.   

అబద్ధం: విదేశీ టీకాలను కొనేందుకు కేంద్రం ఏమీ చేయడంలేదు. 
నిజం: కేంద్ర ప్రభుత్వం 2020 మధ్యనాటి నుంచే అన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ లతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా కు చెందిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలతో చర్చలు జరిగాయి. విదే శీ టీకాలను కొనడం స్టోర్​లో వస్తువులను కొన్నంత ఈజీ కాదు. విదేశీ సంస్థలకూ వాటి ప్రాధాన్యాలు ఉంటాయి. అవి కూడా సొంత దేశాలకే ప్రయారిటీ ఇస్తాయి. టీకా అందుబా టులోకి వస్తోందన్న సూచనలు రాగానే ఫైజర్​తో కేంద్రం ఒప్పందం చేసుకుంది.

అబద్ధం: విదేశీ టీకాలను కేంద్రం అప్రూవ్ చేయలేదు. 
నిజం: విదేశీ వ్యాక్సిన్ లు మనదేశానికి త్వరగా వచ్చేలా కేంద్రం నిబంధనలను సడలించింది. యూఎస్ ఎఫ్ డీఏ, యూకే ఎంహెచ్ఆర్​ఏ, ఈఎంఏ, జపాన్ పీఎండీఏ, డబ్ల్యూహెచ్​వో  ఎమర్జెన్సీ యూజ్​కు ఆమోదం తెలిపిన అన్ని వ్యాక్సిన్ లకూ ఏప్రిల్​లోనే అప్రూవల్ ఇచ్చింది. వీటికి ఇప్పుడు మనదేశంలో ట్రయల్స్ కచ్చితంగా నిర్వహించాలన్న నిబంధనను కూడా సవరించిం ది. ప్రస్తుతం విదేశీ కంపెనీల అప్లికేషన్లు ఏవీ డీసీజీఐ వద్ద పెండింగ్ లో లేవు.

అబద్ధం: కంపల్సరీ లైసెన్సింగ్ ను కేంద్రం అమలు చేస్తుంది.  
నిజం: పేటెంట్ ఉన్న కంపెనీకి చెందిన టీకాల ను ఆ కంపెనీ అనుమతితో సంబంధం లేకుండా ఇతర కంపెనీలు తయారు చేసేలా ఆదేశాలు ఇవ్వడాన్నే కంపల్సరీ లైసెన్సింగ్ అంటారు. అయితే ప్రస్తుతం ఫార్ములా పెద్ద విషయం కాదు. సిబ్బంది, ముడి పదార్థాలు, బయోసేఫ్టీ ల్యాబ్స్ వంటివే కష్టం అవుతాయి. టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ చేసినా, ఆర్ అండ్ డీ పనులు చేసిన సంబంధిత కంపెనీ సహకారంతోనే టీకాల ఉత్పత్తి సాధ్యం.

అబద్ధం: దేశంలో టీకాల ఉత్పత్తి వేగం పెంచేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవడంలేదు. 
నిజం: మనదేశంలో కరోనా వ్యాక్సిన్ కు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) రైట్స్ ఒక్క (భారత్ బయోటెక్) కంపెనీకి మాత్రమే ఉన్నాయి. అందుకే భారత్ బయోటెక్ ప్లాంట్లలో కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు మరో 3 ఇతర కంపెనీల ప్లాంట్లలోనూ ఉత్పత్తి పెరిగేలా కేంద్రం చర్యలు తీసుకున్న ది. ఇప్పుడు భారత్ బయోటెక్ ప్లాంట్లను 1 నుంచి 4కు పెరిగాయి. ప్రస్తుతం నెలకు కోటి డోసుల కొవాగ్జిన్ ఉత్పత్తి అవుతోంది. అక్టో బర్ నాటికి ఇది నెలకు 10 కోట్ల డోసులకు పెరుగుతుంది. దీనికి అదనంగా 3 ప్రభుత్వ సంస్థలు డిసెంబర్ నాటికి 4 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేస్తాయి. కేంద్రం ప్రోత్సా హంతోనే సీరమ్ ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని నెలకు 6.5 కోట్ల డోసుల నుంచి 11.0 కోట్ల డోసులకు పెంచు తోంది. రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో 6 కంపెనీలను కోఆర్డినేట్ చేసి, స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తికి కేంద్రం చర్య లు చేపట్టింది. జైడస్ క్యాడిలా, బయోలజికల్ ఈ, జెన్నోవా కంపెనీల ప్రయత్నాలకూ సాయం చేస్తోంది. కొవిడ్ సురక్షా స్కీం కింద ఫండ్స్ కూడా సమకూరుస్తోంది. భారత్ బయోటెక్ సింగిల్ డోస్ ముక్కు టీకాకు కూడా కేంద్రం నిధులు ఇచ్చింది.

అబద్ధం: కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాల మీదకు తోసేసింది. 
నిజం: వ్యాక్సిన్ కంపెనీలకు ఫండ్స్ ఇవ్వడం దగ్గర నుంచి త్వరగా అప్రూవల్స్ ఇవ్వడం, ఉత్పత్తి పెరిగేలా చూడటం, విదేశీ టీకాలను రప్పించడం వరకూ కేంద్రం చాలా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం కొనుగోలు చేసిన టీకాలన్నింటినీ రాష్ట్రాల కు ఉచితంగా సప్లై చేసింది. రాష్ట్రాలు సొంతంగా టీకాలు కొనుక్కునే అవకాశం కల్పించింది. అదే ఇప్పుడు సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలకు కొరత ఉండటమే ఇందుకు 
ప్రధాన కారణం.

అబద్ధం: రాష్ట్రాలకు తగినన్ని టీకాలను కేంద్రం ఇవ్వడంలేదు. 
నిజం: కేంద్రం అన్ని రాష్ట్రాలకు తగినన్ని వ్యాక్సిన్ లను అలకేట్ చేస్తోంది. ఇందుకో సం ట్రాన్స్ పరెంట్ పద్ధతిలో కచ్చితమైన గైడ్ లైన్స్ ను పాటిస్తోంది. టీకాల లభ్యత గురించి రాష్ట్రాలకు ముందే సమాచారం కూడా ఇస్తోంది.  త్వరలోనే టీకాల ఉత్పత్తి పెరుగుతుంది. టీకాల సప్లై మరింతగా పెరుగుతుంది. కేంద్రం 50 శాతం టీకాలను సేకరించి ఇస్తుండగా, రాష్ట్రాలు 25 శాతం, ప్రైవేట్ హాస్పిటల్స్ మరో 25 శాతం డోసులను పొందుతున్నాయి.

అబద్ధం: పిల్లలకు టీకాలు వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. 
నిజం: ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ దేశం కూడా పిల్లలకు కరోనా టీకాలు వేయలేదు. డబ్ల్యూహెచ్​వో కూడా రికమండ్ చేయలేదు. పిల్లలకు టీకాల సేఫ్టీపై కొన్ని స్టడీలు మాత్రం జరిగాయి. ఆ స్టడీల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మనదేశంలో త్వరలోనే పిల్లలపై కరోనా టీకాల ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ట్రయల్స్ లో వచ్చిన డేటా ఆధారంగా పిల్లలకు టీకాలు వేయాలా? వద్దా? అన్నది మన సైంటిస్టులు డిసైడ్ చేస్తారు.