కలిసున్న కవలలకు సెపరెట్ ఓటర్ కార్డులు

కలిసున్న కవలలకు సెపరెట్ ఓటర్ కార్డులు

ఆ అన్నదమ్ములిద్దరూ కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు. గత 18 ఏండ్లుగా ఒకరిగానే ఉన్న వీరిద్దరికి.. ఇప్పుడు సెపరెట్ ఓటర్ ఐడీ కార్డులు వచ్చాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‎కు చెందిన సోహన్ సింగ్, మోహన్ సింగ్‎లు అవిభక్త కవలలు. తాజాగా వీరిద్దరు 18 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. కాగా.. 12వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ ఎస్. కరుణ రాజు ఇద్దరికీ వేర్వేరుగా రెండు ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్‌లను అందజేశారు. 

సోహన్, మోహన్ కోసం ఎన్నికల కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సీఈఓ కరుణ రాజు తెలిపారు. అదే విధంగా వీరిద్దరూ వేర్వేరుగా ఓటు వేయడానికి వీలు కల్పిస్తామని.. తద్వారా వారు తమ గోప్యతను కాపాడుకోవచ్చని డాక్టర్ రాజు చెప్పారు. భారత ఎన్నికల సంఘం సోహన్, మోహన్ లను వేర్వేరు ఓటర్లుగా పరిగణించి.. వారిద్దరికీ వ్యక్తిగత ఓటు హక్కును ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ 2003లో ఢిల్లీలో జన్మించిన ఈ కవలలను వారి తల్లిదండ్రులు వదిలేశారు. వారిని అమృత్‌సర్‌లోని ఓ అనాథ శరణాలయం దత్తత తీసుకుంది. అప్పటినుంచి వీరిద్దరూ అక్కడే పెరుగుతున్నారు.

పంజాబ్‌ అసెంబ్లీలోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

For More News..

ఒలింపిక్ విజేతకు రిపబ్లిక్ డే సత్కారం

పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్‎గా వీడియో

తెలంగాణకు బీజేపీ, టీఆర్ఎస్ లు అవసరమా?