
ఉత్తర్ ప్రదేశ్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు, షార్ప్ షూటర్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యకేసులో ప్రమేయమున్న షార్ప్ షూటర్ ను పోలీసులు విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ముంబై పోలీసుల కథనం ప్రకారం పరీదాబాద్ కు చెందిన రాహుల్ అలియాస్ సంగా అలియాస్ బాబా అలియాస్ సున్నీ (27) జూన్ 24 న రేషన్ డిపో నడుపుతున్న ఫరీదాబాద్ నివాసి ప్రవీన్ ను హత్య చేశాడు. హత్య విషయమై రాహుల్ ను పోలీసులు విచారించగా..తాను హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు చెప్పాడు. హత్య విషయంలో నిందితుడి బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు డీసీపీ రాజేష్ దుగ్గల్ వెల్లడించారు.
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడు. అయితే బిష్ణోయ్ వర్గానికి చెందిన వారు జింకల్ని ఆరాధిస్తారు. దీంతో అదే వర్గానికి చెందిన లారెన్స్ బిష్ణోయ్.. సల్మాన్ ఖాన్ పై కోపం పెంచుకున్నారు. రెండు సార్లు హత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హత్యకు జోధ్ పూర్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. తనకు సుపారీ ఇచ్చారని రాహుల్ ఒప్పుకున్నట్లు డీసీపీ రాజేష్ దుగ్గల్ తెలిపారు