రైతుల భగీరథ యత్నం

రైతుల భగీరథ యత్నం

గంగాధర, వెలుగు: పంటలను కాపాడుకునేందుకు రైతు భగీరథ యత్నం చేస్తున్నారు.  కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్​, కొండన్నపల్లి, కురిక్యాల, రంగారావుపల్లి, తాడిజెర్రి, ఆచంపల్లి తదితర గ్రామాల రైతులు వరద కాలువపై ఆధారపడి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీళ్లు లేక కాలువ ఎండిపోయింది. పంటలు కాపాడుకునేందుకు కాలువలోనే బావులు తవ్వుతున్నారు. ఇందుకోసం ఒక్కో రైతుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. బావిలో ఊరిన నీళ్లను మోటర్ల ద్వారా పొలాలకు తరలించి పంటలను కాపాడుకుంటున్నారు.