ట్రిపుల్ ఆర్‌‌ అలైన్‌మెంట్ మార్చాలి..నారాయణపురంలో బాధితుల రాస్తారోకో

ట్రిపుల్ ఆర్‌‌ అలైన్‌మెంట్ మార్చాలి..నారాయణపురంలో బాధితుల రాస్తారోకో

యాదాద్రి, సంస్థాన్​ నారాయణపురం, వెలుగు: ట్రిపుల్ ఆర్​అలైన్​మెంట్​మార్చాలని యాదాద్రి జిల్లా సంస్థాన్​నారాయణపురంలో  రైతులు  మునుగోడు -నల్గొండ రోడ్డుపై రాస్తారోకో  నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడారు.  భూమిని నమ్ముకొని బతుకుతున్న తమకు జీవనోపాధి లేకుండా చేయవద్దని కోరారు. 

 పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. బాధితులు యాదాద్రి కలెక్టరేట్​కు ప్రదర్శనగా వచ్చి కలెక్టర్‌‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఇప్పటికైనా  ట్రిపుల్​ఆర్​అలైన్​మెంట్​ మార్చాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.