యూరియా కోసం రైతుల తోపులాట

యూరియా కోసం రైతుల తోపులాట
  • అడ్డుకున్న పోలీసులు

మరికల్, వెలుగు: యూరియా కోసం రైతుల ఆందోళన రోజురోజుకు పెరిగి పోతుంది. శనివారం మండలంలోని తీలేరు సింగిల్​విండోకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా వందల సంఖ్యలో తరలివచ్చారు. వారిని క్యూలైన్‌లో నిలబెట్టడానికి పోలీసులు తీవ్ర ఇక్కట్లు పడగా తోపులాట జరిగింది. చివరకు మహిళా రైతులకు టోకెన్లు ఇప్పించారు. ఒక్కొక్కరికి ఒక బస్తా ఇచ్చినా అది ఏమాత్రం సరిపోదని రైతులు ఆందోళన చేశారు. 

యూరియా కోసం వస్తే పోలీసులు తమను తోసివేస్తారా అంటూ ప్రశ్నించారు. యూరియా అవసరం ఎక్కువగా ఉందని ఆఫీసర్లకు తెలిసినా స్టాక్‌ ఎందుకు తెప్పించడం లేదని నిలదీశారు. 600 బస్తాల యూరియా రాగా వందల సంఖ్యలో రైతులు చేరుకోవడంతో తోపులాట చేసుకుంది. సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్పీ యోగేశ్ గౌతమ్, సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్సై రామును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందస్తుగా బందోబస్త్ ఏర్పాటు చేసి యూరియాను సరఫరా చేయించాలని పోలీసులను ఆదేశించారు.