దీక్ష వాయిదా వేసుకున్నా: అరవింద్ కేజ్రీవాల్

దీక్ష వాయిదా వేసుకున్నా: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీక్షను వాయిదా వేసుకున్నారు. ఆమ్‌ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని మార్చి1నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్నారు. అయితే భారత వైమానిక దాడులతో పాకిస్తాన్, భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా చేపట్టాలనుకున్న నిరాహారదీక్షను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీక్షను ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు సోషల్ మీడియాలో ప్రకటించిన అయన… ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసి ఉండాలని తన నిరాహారదీక్షను వాయిదా వేసుకున్నట్టు ట్వీట్ చేశారు కేజ్రీవాల్.