
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ముగ్గురి స్వస్థలం యాచారం మండలం కురుమిద్ద గ్రామం అని పోలీసులు తెలిపారు. సత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25) ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఎన్టీఆర్ తాండా సమీపంలోని ఫార్మా సిటీ రోడ్డులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
TS05-UA-8547 నంబర్ ఉన్న ఆటో ఫార్మా సిటీ రోడ్డులో కొత్తూర్ X రోడ్డు నుంచి మీర్ఖాన్‌పేట్ గ్రామం వైపు వెళుతుంది. ఆటో ఎన్టీఆర్ తాండా దాటిన తర్వాత, AP04-W-4949 నంబర్.. స్లాబ్ మిక్సింగ్ మెషిన్‌తో కలిసి ఉన్న DCM రోడ్డు మధ్యలో ఆగి ఉంది.
ఆగి ఉన్న డీసీఎంను ఆటో డ్రైవర్ గమనించకపోవడంతో నేరుగా వెళ్లి డీసీఎంను ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. చనిపోయిన వారి శరీర భాగాలు ఆటోలో కొన్ని, రోడ్డుపై కొన్ని ఛిద్రమైపోయిన స్థితిలో కనిపించాయి. పోలీసులు స్పాట్ కు చేరుకుని ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.