
శివ, పార్వతుల పెళ్లంటే ఇంటింటా సంబురమే. మరి ఈ సంతోష సమయంలో శివయ్యకి ఇష్టమైన నైవేద్యాలు లేకపోతే ఎలా? అందుకే శివుడికి ఇష్టమైన అటుకుల పాయసం, గోధుమప్రసాదం చేసేయండి.
గోధుమ ప్రసాదం
గోధుమ పిండి– ఒక కప్పు, చక్కెర– ఒక కప్పు, నెయ్యి– ఒక కప్పు
తయారీ
కడాయిలో చక్కెర వేసి, తగినన్ని నీళ్లు పోసి .. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు మరిగించాలి. మరో పాన్లో నెయ్యి కరిగించి... గోధుమ పిండి వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఆ మిశ్రమం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో చక్కెర పాకం వేసి బాగా కలపాలి. గట్టి పడ్డాక స్టవ్ ఆపితే గోధుమ ప్రసాదం రెడీ.
అటుకుల పాయసం
అటుకులు– ఒక కప్పు, పాలు– అర లీటరు, చక్కెర–పావు కప్పు, సగ్గు బియ్యం– అర కప్పు, డ్రై ఫ్రూట్స్– కొద్దిగా, యాలకుల పొడి– ఒక టీ స్పూన్, నెయ్యి– రెండు టేబుల్ స్పూన్లు, బాదాం తురుము– కొద్దిగా
తయారీ
పాన్లో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్ వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్లో అటుకులు కూడా వేగించి పక్కనుంచాలి. తర్వాత పాన్లో పాలు పోసి, చక్కెర వేసి మరిగించాలి. అందులో యాలకుల పొడి, నానబెట్టిన సగ్గు బియ్యం వేసి ఉడికించాలి. ఆ తర్వాత వేగించిన అటుకులు, డ్రై ఫ్రూట్స్, బాదం తురుము వేసి కలిపితే అటుకుల పాయసం రెడీ.