ఇంట్లోని సీలింగ్ లో కొండ చిలువలు.. పట్టుకుని బయట పడేసిన మహిళ

ఇంట్లోని సీలింగ్ లో కొండ చిలువలు.. పట్టుకుని బయట పడేసిన మహిళ

జూలో కొండ చిలువను చూడాలంటేనే భయం, అలాంటిది ఇంట్లో సీలింగ్ లో  కొండచిలువ  కనిపిస్తే ఇంకేమైనా ఉందా...  కళ్ల ముందు పాము పాకుతూ కనిపిస్తేనే కొద్దిసేపు గుండె ఆగినంత పని అవుతుంది. అలాంటిది రెండు పెద్దపెద్ద కొండ చిలువలు  ఇంటి సీలింగ్  లో ఉన్నాయంటే  పై ప్రాణం పైనే పోతుంది కదా.  కాని ఆస్ట్రేలియాలో ఓ మహిళ రెండు పాములను చాకచక్యంగా పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఆస్ట్రేలియాలో ఓ ఇంటి స్టోర్ రూంలో సౌండ్ రావడం గమనించింది.  సీలింగ్ రెండు భారీ పాములు ఉన్నట్లు గమనించింది.  అదే మనమైతే ఆవడదూరం పరిగెత్తి.. పాములు పట్టే వారు వచ్చేంతవరకు బయటే ఉంటాం.  కాని ఈ మహిళ చాలా ప్రశాంతంగా ఉంది. పైగా చాకచక్యంగా ఆ రెండు పాములను చేతులతో పట్టుకొని  కింద కూర్చున్నట్లు వీడియోలో ఉంది. 

సోషల్ మీడియా లో పోస్ట్ చేయబడిన వీడియోలో ఓ మహిళ టేబుల్ పై నిలబడి ఉంది.  ఆమె చేతిలో ఒక కర్రను చూడవచ్చు. దానితో ఇంటి పై భాగంగంలో ఉన్న సీలింగ్ నుంచి ముందు ఒక కొండ చిలువను మెలికలు తిప్పుతూ పట్టుకుంది.  ఆ తరువాత ఇంకో కొండచిలువను కూడా పట్టుకొని వాటిని మెలికలు వేస్తూ చాలా ప్రశాంతంగా కిందకు దిగి కూర్చొంది.   ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతోనే వైరల్  అయింది.  ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) 8 లక్షల మంది ఈ వీడియోను చూశారు.  ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.  ఒకరు కొత్త యజమానుల కోసం ఇల్లును వదిలిపెట్టారని కామెంట్ చేయగా.. మరొకరు రాక్షస పాము ఉన్నా కాని ఏమీ లేనట్టుగా ప్రవర్తించిందని .. చిన్న పిల్లలు చూస్తే షాక్ అవుతారని వ్యాఖ్యానించారు.