లాట్​​ మొబైల్స్​లో ఫెస్టివల్​ ఆఫర్స్​

లాట్​​ మొబైల్స్​లో ఫెస్టివల్​ ఆఫర్స్​

హైదరాబాద్​, వెలుగు: మొబైల్​ రిటైల్​ రంగంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్​ మొబైల్​ రిటైల్​ చెయిన్​ ‘లాట్​ మొబైల్’​ దసరా, దీపావళి ఆఫర్లకు తెరతీసింది. ప్రతి స్మార్ట్​ఫోన్​ కొనుగోలుపై ఫైర్ బోల్ట్​​ కాలింగ్​​వాచ్​, టవర్​ ఫ్యాన్​, ఎయిర్​పాడ్స్​,   హోమ్​ థియేటర్​ వంటి బహుమతులు ఇస్తారు. స్మార్ట్​టీవీల ధరలు రూ.తొమ్మిది వేల నుంచి, ల్యాప్​టాప్స్ ధరలు రూ.17,500 నుంచి మొదలవుతాయి.

ఎస్​బీఐ కార్డులతో కొంటే 7.5 శాతం వరకు ఇన్​స్టంట్​ క్యాష్​బ్యాక్​ ఇస్తామని సంస్థ డైరెక్టర్​ ఎం.అఖిల్​ చెప్పారు. ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​పై రూ.ఎనిమిది వేల వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్​ ఇస్తారు. స్మార్ట్​వాచీలపై 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. 50 శాతం వరకు అష్యూర్డ్​ బై బ్యాక్​ ఉంటుంది. వివో ఫోన్లపై పది శాతం వరకు క్యాష్​బ్యాక్, ఒప్పో ఫోన్లపై జీరో డౌన్​ పేమెంట్ సౌకర్యంతోపాటు రూ. పది లక్షల వరకు గెలుచుకోవచ్చు. శామ్​సంగ్​ మొబైల్స్​పై రూ.10 వేల వరకు అప్​గ్రేడ్​ బోనస్​ ఇస్తారు. వన్​ప్లస్​ ఫోన్లపై రూ.ఆరు వేల వరకు క్యాష్​బ్యాక్​ ఉంటుంది.