
నర్సింహులపేట, వెలుగు: వడదెబ్బతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగింది. తూటి మాణిక్యం(50)ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్. కాగా.. విధుల్లో భాగంగా ఎండతీవ్రతతో అస్వస్థతకు గురై ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి సీరియస్ కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.