
ఢిల్లీ: చైనాకు వ్యతిరేకంగా రెండు రకాల యుద్ధాలు చేస్తున్నామన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఒకటి ఆ దేశం నుండి వచ్చిన కరోనా వైరస్ కాగా.. మరొకటి సరిహద్దు రేఖ వద్ద భారత బలగాలు చైనాతో పోరాడుతున్నారన్నారు. 20 మంది సైనికులు దైర్యంగా వెనక్కి తగ్గకుండా చైనా పైన పోరాడి చనిపోయారని కేజ్రీవాల్ తెలిపారు. డ్రాగన్ సైన్యం కుట్రపూరిత దాడులకు వ్యతిరేకంగా దేశమంతా ఏకమై భారత సైన్యానికి అండగా నిలుస్తోందని చెప్పారు. కరోనాతో పాటు చైనా సైన్యంపైనా పోరాడి రెండు యుద్ధాలలో మనమే తప్పక గెలుస్తామన్నారు.
గతంలో రోజుకు ఐదువేల కరోనా పరీక్షలు జరిగేవని, నేడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోజుకు 18 వేల టెస్టులు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు కరోనా టెస్ట్ లలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తామని అరవింద్ కేజ్రీవాల్ అన‌్నారు.