టాలీవుడ్ హీరో రాజశేఖర్ (Rajasekhar) ఓ మూవీ షూటింగ్లో గాయపడ్డారని సినీ వర్గాల సమాచారం. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకి వచ్చింది. గత నెల (నవంబర్ 25న) రాజశేఖర్ తన కొత్త సినిమా చిత్రీకరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తన కుడి కాలి మడమ దగ్గర గాయమైనట్లు, ఆ వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి సర్జరీ నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో శస్త్ర చికిత్స సక్సెస్ ఫుల్గా కంప్లీట్ అయినట్లు సినీ యూనిట్ వెల్లడించింది.
ప్రస్తుతం రాజశేఖర్ తమిళ రీమేక్ మూవీ ‘లబ్బర్ పందు‘లో నటిస్తున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్‌లో భాగంగానే రాజశేఖర్ గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడ ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు తెలిపాయి. ఓ నాలుగు వారాల పాటు రాజశేఖర్ రెస్ట్ తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. రాజశేఖర్ ప్రస్తుతం ఓవైపు సోలో హీరోగా నటిస్తూనే.. మరోవైపు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆమధ్య నితిన్ హీరోగా వచ్చిన ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్’ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. అలాగే, ఇటీవలే శర్వానంద్ బైకర్ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఇందులో రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. శర్వా బైక్ రేసర్‌గా నటిస్తున్నాడు.
►ALSO READ | ఆర్కే దీక్ష .. వీర జవాన్ మురళి నాయక్‌కు అంకితం
మడ్ బైక్ రేసుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథకు ఎంతో కీలకమైన పాత్రను రాజశేఖర్ పోషిస్తున్నారని, ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మించే యాక్షన్ మూవీలో ఆయన హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. నిఖిల్‌తో ‘స్పై’ తీసిన ఎడిటర్ గ్యారీ బీహెచ్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.

